4జీపై ఉన్న నిషేధాన్ని జనవరి 8 వరకు పొడగించిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-26T18:02:52+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో 4జీ సేవలపై జనవరి 8 వరకు నిషేధాన్ని పొడగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అయితే ఉదమ్‌పూర్, గండేర్‌బాల్

4జీపై ఉన్న నిషేధాన్ని జనవరి 8 వరకు పొడగించిన ప్రభుత్వం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో 4జీ సేవలపై ఉన్న నిషేధాన్ని జనవరి 8 వరకు పొడగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అయితే ఉదమ్‌పూర్, గండేర్‌బాల్ జిల్లాల్లో మాత్రం 4జీ సేవలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో మాత్రం 2జీకి కల్పించే ఇంటర్నెట్ స్పీడ్‌ కొనసాగుతుందని, ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆంక్షలు డిసెంబర్ 26 నుంచి జనవరి 8 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు 4జీ సేవలపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని గుప్‌కార్ అలయెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ ఆంక్షల ద్వారా పిల్లలు, వ్యాపారవేత్తలు, మిగితా వర్గాల వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఫరూక్ కోరారు. 

Updated Date - 2020-12-26T18:02:52+05:30 IST