మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం.. కొత్తగా...

ABN , First Publish Date - 2020-06-26T05:12:52+05:30 IST

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే మహారాష్ట్రలో కొత్తగా...

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం.. కొత్తగా...

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే మహారాష్ట్రలో కొత్తగా 4841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,342. గురువారం మహారాష్ట్రలో 192 కరోనా మరణాలు నమోదయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


దీంతో.. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 6931కి చేరింది. అయితే.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా కాస్త మెరుగ్గానే ఉంది. గురువారం ఒక్కరోజే 3661 మంది మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకున్నారు.

Updated Date - 2020-06-26T05:12:52+05:30 IST