కర్ణాటకలో కొత్తగా 48 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-09T02:15:23+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలుపుకొని ఇప్పటివరకు...

కర్ణాటకలో కొత్తగా 48 కరోనా కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలుపుకొని ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 753కు పెరిగిందని, వీరిలో 376 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 347 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. కాగా కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 3,390 కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు కేంద్రం ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 56,342కు పెరిగాయని, మరణాల సంఖ్య 1,886కు చేరిందని తెలిపింది.


ఇదిలా ఉంటే 24 గంటల వ్యవధిలో 1,273 మంది కరోనా నుంచి కోలుకున్నారని, వీరితో కలిపి మొత్తం 16,540 మంది కరోనా నుంచి రికవర్ అయి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, ప్రస్తుతం కోలుకుంటున్న వారి శాతం 29.36 గా ఉందని, ఇది సంతోషించదగ్గ విషయమని కేంద్రం వివరించింది.

Updated Date - 2020-05-09T02:15:23+05:30 IST