దేశంలో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-11-21T15:51:36+05:30 IST

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో కాస్త తగ్గింది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

దేశంలో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదు

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో కాస్త తగ్గింది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 90,50,598కి చేరుకున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 564 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 1,32,726కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,39,747 యాక్టివ్ కేసులున్నాయి. 84,78,124 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.67 శాతం కాగా.. మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. 


Read more