రాష్ట్రాలకు రూ.46,038 కోట్లు

ABN , First Publish Date - 2020-04-21T09:35:16+05:30 IST

కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ర్టాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్‌ నెల వాటాను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సోమవారం వెల్లడించింది.

రాష్ట్రాలకు రూ.46,038 కోట్లు

తెలంగాణకు రూ.982 కోట్లు, ఏపీకి రూ.1,892.64 కోట్లు 


న్యూఢిల్లీ: కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్‌ నెల వాటాను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సోమవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038 కోట్లు విడుదల చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,892.64 కోట్లు, తెలంగాణకు రూ.982 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు వెంటనే అందుబాటులోకి రానున్నాయి. 

Updated Date - 2020-04-21T09:35:16+05:30 IST