45 శాతం కోవిడ్ నుంచి బయటపడ్డారు: సీఎం

ABN , First Publish Date - 2020-05-19T00:26:45+05:30 IST

దేశ రాజధానిలో ఇంతవరకూ 45 శాతం కోవిడ్-19 పేషెంట్లకు పూర్తి స్వస్థత చేకూరినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..

45 శాతం కోవిడ్ నుంచి బయటపడ్డారు: సీఎం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇంతవరకూ 45 శాతం కోవిడ్-19 పేషెంట్లకు పూర్తి స్వస్థత చేకూరినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సోమవారంనాడు డిజిటల్ కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో సీఎం మాట్లాడుతూ, ఇంతవరకూ రాష్ట్రంలో 10,054 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, ఇది పెద్ద సంఖ్యే అయినప్పటికీ 4,485 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్చ్ అయ్యారని, మొత్తం కేసుల్లో ఇది 45 శాతమని చెప్పారు.


కోవిడ్-19తో ఇంతవరకూ 160 మంది మృత్యువాత పడ్డారని, అయితే ప్రతీ ప్రాణం విలువైనదిగా భావించి తాము వైద్యసేవలు అందిస్తున్నట్టు చెప్పారు. కొన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో మృతుల సంఖ్య తక్కువగానే ఉందని అన్నారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ కరోనా వైరస్ ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. 'కరోనాతో కలిసి ముందుకు వెళ్లక తప్పదు. సుమారు గత రెండునెలల లాక్‌డౌన్‌లో ఇందుకు మనం సిద్ధమవుతూ వచ్చాం. ఇప్పుడు తిరిగి ఆర్థిక వ్యవస్థను పట్టాలపైకి తేవాలి. లాక్‌డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ వెళ్లాలి' అని కేజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2020-05-19T00:26:45+05:30 IST