రూ. 40 లక్షల బంగారం దొరికితే తిరిగిచ్చేశాడు!
ABN , First Publish Date - 2020-09-14T08:13:27+05:30 IST
యూఏఈలో నివసిస్తున్న ఓ భారతీయుడికి ఓ బ్యాగు దొరికింది. అది తెరిచి చూస్తే అందులో 40
దుబాయి, సెప్టెంబరు 13: యూఏఈలో నివసిస్తున్న ఓ భారతీయుడికి ఓ బ్యాగు దొరికింది. అది తెరిచి చూస్తే అందులో 40 లక్షల విలువచేసే బంగారం, రూ.10 లక్షల డబ్బు ఉంది. అయితే, పరుల సొమ్ముపై దురాశ పడకుండా ఆ బ్యాగులోనే వాటిని ఉంచి, నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి వాటిని అప్పగించారు. న్యాయంగా డబ్బు అప్పగించిన రితేశ్ జేమ్స్ గుప్తాను పోలీసులు అభినందించారు.
ఆయనకు ప్రశంసా పత్రం ఇచ్చారు. ఆ బ్యాగు ఎవరిదన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.