40 మంది ఎయిమ్స్ డాక్టర్లు, సిబ్బంది సెల్ఫ్ క్వారంటైన్

ABN , First Publish Date - 2020-04-24T21:21:46+05:30 IST

ఢిల్లీ ఎయిమ్స్‌లోని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలోని ఓ మేల్‌నర్స్‌(30)కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్యులు

40 మంది ఎయిమ్స్ డాక్టర్లు, సిబ్బంది సెల్ఫ్ క్వారంటైన్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్‌లోని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలోని ఓ మేల్‌నర్స్‌(30)కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్యులు సహా 40 మంది సిబ్బంది సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. వైద్యాధికారులు వెంటనే వీరితోపాటు మేల్ నర్స్ పనిచేసిన వార్డులోని రోగుల శాంపిళ్లను కూడా సేకరించి పరీక్షలకు పంపారు. ఇప్పటి వరకు 22 మందికి సంబంధించిన ఫలితాలు రాగా, అవన్నీ నెగటివ్‌గా వచ్చాయని, మిగతా వారి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు వైద్యుడు ఒకరు తెలిపారు. బాధిత మేల్‌ నర్స్ తనకు జ్వరంగా ఉండడంతో  గత శనివారం ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించాడు. సోమవారం వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.


అయితే, సోమవారం విధుల్లో ఉండడంతో బుధవారం పరీక్షలు చేయించుకున్నాడు. అదే రోజు రాత్రి రిజల్ట్ రాగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. గురువారం ఉదయం ఈ విషయం అందరికీ తెలిసింది. ప్రస్తుతం అతడు ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నాడు. మేల్ నర్స్‌కు కరోనా సోకిందన్న విషయం తెలిసిన వెంటనే అతడు పనిచేసే గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలోని వైద్యులు, సిబ్బంది మొత్తం 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.  

Updated Date - 2020-04-24T21:21:46+05:30 IST