కేన్సర్, కరోనాపై గెలిచిన నాలుగేళ్ల పాప
ABN , First Publish Date - 2020-04-28T07:08:44+05:30 IST
ఆమె వయసు నాలుగేళ్లే. అత్యంత అరుదైన గాంగ్లియోన్యూరోబ్లాస్టొమా అనే మూత్రపిండాల కేన్సర్‌పై గత ఏడాదే విజయం సాధించింది. అయితే.. ఆ పోరాటంలో జరిగిన కీమోథెరపీ చికిత్స కారణంగా...

- దుబాయ్‌లోని భారత సంతతి బాలిక ఘనత
దుబాయ్, ఏప్రిల్ 27: ఆమె వయసు నాలుగేళ్లే. అత్యంత అరుదైన గాంగ్లియోన్యూరోబ్లాస్టొమా అనే మూత్రపిండాల కేన్సర్‌పై గత ఏడాదే విజయం సాధించింది. అయితే.. ఆ పోరాటంలో జరిగిన కీమోథెరపీ చికిత్స కారణంగా ఆమె శరీరంలో రోగ నిరోధక శక్తి స్థాయి బాగా పడిపోయింది. అలాంటి ఆ చిన్నారికి తాజాగా కరోనా సోకింది. కానీ.. ఆశ్చర్యంగా కరోనాను కూడా ఆ పాప జయించింది.
వరసగా రెండు ప్రాణాంతక ఆరోగ్యసమస్యలపై విజయఢంకా మోగించి మృత్యుంజయురాలిగా నిలిచిన ఆమె, దుబాయ్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన బాలిక. పేరు శివాని. స్థానికంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న తన తల్లి నుంచి శివానికి వైరస్ సోకింది. ఆమె బతుకుతుందని తాము కూడా అనుకోలేదని వైద్యులు తెలపడం, శివాని పరిస్థితికి అద్దం పడుతోంది. అదృష్టమో, మరేమోకానీ.. ఆమె మహమ్మారిపై విజయాన్ని సాధించింది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. ఎందుకైనా మంచిదని 14రోజుల క్వారంటైన్‌లో ఉంచినట్లు వైద్యులు పేర్కొన్నారు.