4 కోట్ల మందికి అన్యాయం.. మమత ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఫైర్!

ABN , First Publish Date - 2020-12-28T05:30:00+05:30 IST

తృణమూల్ వల్ల 4 కోట్ల మంది బెంగాలీలకు నష్టం: కేంద్రమంత్రి

4 కోట్ల మందికి అన్యాయం.. మమత ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఫైర్!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా రాష్ట్రానికి చెందిన దాదాపు 4 కోట్ల మంది కేంద్ర సంక్షేమ పథకాల్లో 80 శాతం ప్రయోజనాలను అందుకోలేకపోయారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. పానిహతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రాష్ట్రంలోని 76 లక్షల మంది రైతులు రూ. 4,200 కోట్లు కోల్పోయారని ఆయన ఆరోపించారు. ‘‘పేదలు, దళితులు, గిరిజనులు సహా అణగారిన వర్గాలకు ప్రజల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో 80 శాతం ప్రయోజనాలను అందకుండా మమత ప్రభుత్వం తిరస్కరించింది..’’ అని ఆయన అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బెంగాల్లో అవినీతి రాజ్యమేలుతోందనీ.. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి దీనికి పుల్‌స్టాప్ పెడతామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-28T05:30:00+05:30 IST