పండుగ సీజన్‌లో మొత్తానికో గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2020-10-14T00:44:43+05:30 IST

దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను...

పండుగ సీజన్‌లో మొత్తానికో గుడ్‌న్యూస్

గుడ్‌న్యూస్.. పండుగ సీజన్‌లో 392 ప్రత్యేక రైళ్లకు అనుమతి

న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. పండుగ సీజన్‌లో 392 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు తాజాగా ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకూ రాకపోకలు సాగించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన షెడ్యూల్‌ను రైల్వే శాఖ త్వరలో వెల్లడించనుంది. ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక రైళ్లకు ఉన్న టికెట్ ఛార్జీలే.. అక్టోబర్ 20 నుంచి అందుబాటులోకి రానున్న రైళ్లలో కూడా అమలవుతాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.


తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్న ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌పై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది. ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోవడంతో దసరాకు హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంతూళ్లకు వెళ్లడం చాలామందికి క్లిష్టతరంగా మారింది. ప్రైవేట్ ట్రావెల్స్‌ అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఈ స్పెషల్ ట్రైన్స్‌పైనే అందరి దృష్టి ఉంది. 



Updated Date - 2020-10-14T00:44:43+05:30 IST