అఫ్ఘాన్‌లో వరుస ఉగ్రదాడులు.. 38 మంది మృతి
ABN , First Publish Date - 2020-05-13T08:00:59+05:30 IST
రెండు వరుస ఉగ్రదాడులతో అఫ్ఘానిస్థాన్ మంగళవారం నెత్తురోడింది. ఈ దాడుల్లో 38 మంది మృతిచెందగా, 75 మందికిపైగా గాయ పడ్డారు. తూర్పు నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లోని ఖెవాలో ఓ మాజీ పోలీసు అధికారి అంతిమయాత్ర లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 24 మంది ప్రాణాలు...

కాబూల్, మే 12: రెండు వరుస ఉగ్రదాడులతో అఫ్ఘానిస్థాన్ మంగళవారం నెత్తురోడింది. ఈ దాడుల్లో 38 మంది మృతిచెందగా, 75 మందికిపైగా గాయ పడ్డారు. తూర్పు నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లోని ఖెవాలో ఓ మాజీ పోలీసు అధికారి అంతిమయాత్ర లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కాబూల్‌లో షియాలు నివసించే ప్రాంతంలోని ఒక మెటర్నిటీ ఆస్పత్రిలోకి ముగ్గురు ముష్కరులు చొరబడి రక్తపాతం సృష్టించారు. వారి కాల్పుల్లో ఇద్దరు శిశువులు, పలువురు మహిళలు సహా 14 మంది మరణించగా, 15 మందికి గాయాలయ్యాయి. భద్రతా దళాలు 100 మందిని కాపాడటంతో పాటు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ దాడులతో తమకు సంబంధం లేదని తాలిబన్లు చెప్పారు. ఈ దాడులను భారత విదేశాంగ శాఖ ఖండించింది.