ఆగని కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-05-09T08:44:49+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజూ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటోంది. వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైనే కేసులు నమోదయ్యాయి.

ఆగని కరోనా విజృంభణ

  • మరో 30 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు..
  • ముంబై జైలులో 77 మంది ఖైదీలకు
  • కేసులు రెట్టింపయ్యే సమయం తగ్గింది
  • కరోనాతో కలిసి జీవించాలన్న కేంద్రం

న్యూఢిల్లీ, మే 8: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజూ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటోంది. వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైనే కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోటుకొంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 3,390 కరోనా కేసులు, 103 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 56,342కు, మృతుల సంఖ్య 1,886కు పెరిగింది. 103 మరణాల్లో ఎక్కువగా మహారాష్ట్రలో 43, గుజరాత్‌లో 29 నమోదయ్యాయి. ఈ రాష్ట్రాల్లోని ముంబై, అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. వీటితో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేశంలో కేసులు రెట్టింపయ్యే సమయం 12 రోజుల నుంచి 10 రోజులకు తగ్గింది. మహారాష్ట్రలో తాజాగా 1,089 కేసులతో మొత్తం 19,063కు చేరాయి. బీఎ్‌సఎ్‌ఫలో మరో 30 మంది సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో ఇద్దరు ఢిల్లీ హెడ్‌క్వార్టర్స్‌ సిబ్బంది.


తాజా కేసులతో బీఎ్‌సఎ్‌ఫలో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 223కు చేరింది. కేంద్ర సాయుధ బలగాల్లో ఇప్పటి వరకు 500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలులో 77 మంది ఖైదీలు, 26 మంది సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. వైరస్‌ ప్రబలిన తర్వాత ఆర్థర్‌ సహా 8 జైళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఐసొలేట్‌ చేసింది. దీని ప్రకారం.. ఆ జైళ్లలోకి కొత్త ఖైదీలను పంపించరు. సిబ్బంది సహా లోపల ఉన్నవారిని బయటకు వెళ్లనీయరు. ఈ జాగ్రత్తలు తీసుకున్నా కరోనా ప్రవేశించింది. వంట మనిషి నుంచి  వైరస్‌ వైవైవవవ్యాపించినట్లు గుర్తించారు. కరోనా సోకిన ఖైదీలను వేరే ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఒక భవనంలోకి తరలించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 72మంది రాష్ట్ర రిజర్వు పోలీసు జవాన్లు కరోనా బారినపడ్డారు.  కరోనా వైర్‌సతో కలిసి జీవించడం నేర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు. కరోనా నివారణ మార్గదర్శకాలు పాటించడం జీవితంలో భాగం కావాలని సూచించారు.   


గ్రామాలకు పాకకుండా చూడాలి

బెంగళూరు: పట్టణాల నుంచి అధిక జనాభా నివసించే గ్రామాలకు కరోనా వైరస్‌ వ్యాపించకుండా చూడడం మహమ్మారిపై దేశం సాగిస్తున్న యుద్ధంలో చాలా కీలకమని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రొఫెసర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. పట్టణాలు-గ్రామాలు, హాట్‌స్పాట్లు- నాన్‌-హాట్‌స్పాట్ల మధ్య రాకపోకల ను సాధ్యమైనంత తగ్గించాలని చెప్పారు.   


బెంగాల్‌లో అధిక మరణాల రేటు వెనుక...

కోల్‌కతా: ప్రజల్లో సామాజికపరమైన భయానుమానాలు, తక్కువ సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహించడం పశ్చిమ బెంగాల్‌లో కరోనా రోగుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉండడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.  మరోవైపు.. ఛత్తీస్‌గఢ్‌ తిరిగొచ్చిన 22 మంది వలస కార్మికులు క్వారంటైన్‌ కేంద్రం నుంచి తప్పించుకుని పారిపోయారు. 


రికవరీ రేటు 29.36%’

గత 24 గంటల్లో 1,273 మంది సహా ఇప్పటి దాకా 16,540 మంది కోలుకొన్నారని, రికవరీ రేటు 29.36 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ‘‘దేశంలోని 216 జిల్లాల్లో ఇప్పటి వ రకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 42 జిల్లాల్లో  28 రోజులుగా కొత్త కేసులు లేవు. 29 జిల్లాల్లో  21 రోజులుగా నమోదు కాలేదు. 36 జిల్లాల్లో గత 14 రోజులుగా, 46 జిల్లాల్లో 7 రోజులుగా లేవు’’ అని వివరించింది.

Updated Date - 2020-05-09T08:44:49+05:30 IST