దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు నమోదు..
ABN , First Publish Date - 2020-12-13T16:33:05+05:30 IST
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనా కారణంగా నిన్న 391 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకూ కరోనా కేసులు 98,57,029కి చేరుకున్నాయి. 1,43,019 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,56,546 యాక్టివ్ కేసులున్నాయి. 93,57,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 94.93 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.