కరోనాకు మందు అని తాగి.. 300 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2020-03-27T22:35:58+05:30 IST

చైనాలో పుట్టి, ప్రపంచమంతా వ్యాపించి.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది కరోనా వైరస్. ఈ కొత్తరకం వైరస్ కు విరుగుడు ...

కరోనాకు మందు అని తాగి.. 300 మంది దుర్మరణం

టెహ్రాన్: చైనాలో పుట్టి, ప్రపంచమంతా వ్యాపించి.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది కరోనా వైరస్. ఈ కొత్తరకం వైరస్‌కు విరుగుడు కనుక్కోవడానికి ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మిథనాల్‌తో కరోనా వైరస్‌ను  ఓడించవచ్చంటూ ఇరాన్ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరలయ్యాయి.


ఈ తప్పుడు వార్తలను నమ్మిన కొంతమంది మిథనాల్ తాగారు. అయితే ఇది శరీరానికి మంచిది కాదు. దీంతో మిథనాల్ తాగిన 300 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 1100 మంది వరకు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారు. ఈ ఘటనలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు

Updated Date - 2020-03-27T22:35:58+05:30 IST