జీతంలో 30శాతం కోత విధించుకున్న సీఈసీ, ఈసీలు

ABN , First Publish Date - 2020-04-14T08:46:29+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ)సునీల్‌ అరోరా, కమిషనర్లు (ఈసీలు) అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్ర తమ జీతాల్లో స్వచ్ఛందంగా కోత...

జీతంలో 30శాతం కోత విధించుకున్న సీఈసీ, ఈసీలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ)సునీల్‌ అరోరా, కమిషనర్లు (ఈసీలు) అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్ర తమ జీతాల్లో స్వచ్ఛందంగా కోత విధించుకున్నారు. ఏప్రిల్‌ నుంచి ఏడాది పాటు తమ మూల వేతనంలో ముప్పై శాతం తగ్గించి తీసుకుంటామని ప్రకటించారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం వెల్లడించింది. కాగా, ఇదే బాటలో సమాచార కమిషనర్లు కూడా పయనించారు. తమ మూలవేతనంలో 30 శాతం తగ్గించుకుంటున్నట్లు వెల్లడించారు. 


Updated Date - 2020-04-14T08:46:29+05:30 IST