భారతీయులూ విలవిల

ABN , First Publish Date - 2020-04-08T08:30:27+05:30 IST

Indian people america corona

భారతీయులూ విలవిల

హాట్‌స్పాట్లలోనే ఎక్కువగా భారత సంతతి ప్రజలు ఇప్పటికే నలుగురు తెలుగువారు మృతి న్యూజెర్సీలో 30 మందికి పాజిటివ్‌? ప్రసిద్ధ జర్నలిస్టు బ్రహ్మ కూచిభొట్ల మృతి బ్రిటన్‌లో వైద్యులకు గండం భారత సంతతి సర్జన్‌ మృతి స్పెయిన్‌లో మళ్లీ విజృంభణ ఒక్కరోజులోనే 743 మరణాలు


హాట్‌స్పాట్లలోనే ఎక్కువగా భారత సంతతి.. అమెరికాలో నలుగురు తెలుగువారు మృతి

న్యూజెర్సీలో 30మందికి పాజిటివ్‌? 


(న్యూయార్క్‌ నుంచి కిలారు అశ్వనీ కృష్ణ) 

అమెరికాను కరోనా వైరస్‌ అల్లాడిస్తోంది. సోమవారం నాటికి 10,800మంది మరణించారు. 70 ఏళ్లు పైబడన నలుగురు తెలుగువారూ కరోనాతో మృతి చెందినట్లు సమాచారం. సిలికాన్‌ వ్యాలీలో ఉంటున్న ఓ తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లండన్‌ వెళ్లి కరోనాతో వచ్చారు. అది ఆయన తల్లికి సోకడంతో మృతి చెందింది.


ఏ దేశంలోనూ జరగని స్థాయిలో ఏకంగా 16 లక్షలమందికిపైగా కరోనా పరీక్షలు అమెరికాలోనే జరిగాయి. సోమవారం రాత్రికి నమోదైన 3.66లక్షల కేసుల్లో సగం న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాలకు చెందినవే. ఈ నగ రాల్లో ఉంటున్న భారత సంతతికి చెందిన అమెరికా పౌరుల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ట్టు సమాచారం. ఈ విషయాన్ని వారు గోప్యంగా ఉం చడంతో అధికారిక లెక్కలు లేవు.అమెరికాలోని భారత సంతతి వైద్యుల సమాఖ్య (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు  ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ‘ఇంత విపత్తును ఊహించలేదు’ అని భారత సంతతికి చెందిన అమెరికా ప్రముఖుడు రాజేంద్ర డిచ్‌పల్లి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌ ప్రాంతంలో భారతీయులు, తెలుగువారు ఎక్కువగా ఉంటారు. ఆదివారం తెలుగువారు ఎక్కువగా ఉండే ఒక్‌ ట్రీ రోడ్‌లో 30 మందికి కరోనా సోకినట్లు వార్తలొచ్చా యి. తమ ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఇరుగు పొరుగు వారికి తెలియనీయడం లేదు.


వాళ్లకు ఫ్లూ 

న్యూయార్క్‌లోని నావికాదళం షిప్‌ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న బృందంలో ఒకరికి పాజిటివ్‌ తేలింది. ఈ నగరంలో మరణాల సంఖ్య రోజూ 630 నుంచి 594కు తగ్గటాన్ని గవర్నర్‌ ఆండ్రూ క్వోమో కాస్త ఉపశమనంగా అభివర్ణించారు. న్యూయార్క్‌లో సోమవారం నాటికి 4,758 మరణాలు, 1.30 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ గడ్డు పరిస్థితి వారం లేదా కాస్త ఎక్కువ కాలం ఉండొచ్చని ట్రంప్‌ అన్నారు. కాగా, లాక్‌డౌన్‌తో భారత్‌లో చిక్కుకున్న అమెరికా పౌరు ల్లో 1,300 మంది సోమవారం రాత్రి స్వస్థలం చేరుకొన్నారు. వారికి ఫ్లూ లక్షణాలు కనిపించా యని అధికారులు తెలిపారు. విపక్ష డెమోక్రటిక్‌ ఎంపీ కెరన్‌ విట్‌సెట్‌ కరోనా నుంచి కోలుకొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడటం వల్లే తన ఆరోగ్యం కుదుటపడిందని విట్‌సెట్‌ ప్రకటించారు. ఇది రిపబ్లికన్‌ పార్టీ అధినేత ట్రంప్‌ మార్క్‌ ఔషధం. కాగా, కరోనా మృతుల అంత్యక్రియలకు 7-9 రోజులు పడు తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-04-08T08:30:27+05:30 IST