కేరళలో కొత్తగా 29 కరోనా పాజిటివ్ కేసులు: సీఎం ప్రకటన
ABN , First Publish Date - 2020-05-18T22:54:01+05:30 IST
కేరళలో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నాళ్లు పూర్తిగా తగ్గినట్టు కనిపించినప్పటికీ...

తిరువనంతపురం: కేరళలో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నాళ్లు పూర్తిగా తగ్గినట్టు కనిపించినప్పటికీ మళ్లీ కరోనా కేరళను వెంటాడుతోంది. సోమవారం కేరళలో కొత్తగా 29 పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఈ 29 కేసుల్లో 21 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారేనని సీఎం తెలిపారు.
ఏడుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారని, ఒకరికి కరోనా సోకిన వ్యక్తి వల్ల వ్యాప్తి చెంది.. అతనికి కరోనా సోకిందని సీఎం వెల్లడించారు. సోమవారం డిశ్చార్జ్‌లేవి లేకపోవడం గమనార్హం. కేరళలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 630కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 130.