కరోనా రిపోర్ట్: బెంగాల్‌లో కొత్తగా 270పైగా కేసులు

ABN , First Publish Date - 2020-06-02T01:03:30+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 270 పైగా కరోనా కేసులు నమోదైనట్లు..

కరోనా రిపోర్ట్: బెంగాల్‌లో కొత్తగా 270పైగా కేసులు

కలకత్తా: రాష్ట్రంలో కొత్తగా 270 పైగా కరోనా కేసులు నమోదైనట్లు బెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 271 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8మంది మరణించారు. 149 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 5,772కు చేరింది. ఇప్పటివరకు 2,306 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 3,141 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే  325 మంది కరోనా కారణంగా మరణించగా వారిలో 72 మంది కరోనా పాజిటివ్ అయినప్పటికీ ఇతర కారణాలతో మరణించారు.

Updated Date - 2020-06-02T01:03:30+05:30 IST