కరోనాపై గెలిచిన 27రోజుల శిశువు

ABN , First Publish Date - 2020-06-20T04:28:00+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అదీ ముంబై, పూణే తదితర ప్రాంతాల్లో...

కరోనాపై గెలిచిన 27రోజుల శిశువు

పూణే: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అదీ ముంబై, పూణే తదితర ప్రాంతాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో పూణేలోని హదాప్సర్ ప్రాంతానికి చెందిన ఓ 27రోజుల శిశువు కరోనా నుంచి కోలుకుంది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన చేశారు. మే 20న పుట్టిన ఆ బిడ్డకు ఊపిరి తీసుకోడంలో సమస్యలు తలెత్తాయని, తీరా పరీక్షలు చేస్తే కరోనా అని తేలిందని వైద్యులు తెలిపారు. చిట్టచివరకు ఈ బాబు కరోనా నుంచి కోలుకోవడంతో అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

Updated Date - 2020-06-20T04:28:00+05:30 IST