వచ్చే పది రోజుల్లో 2,600 శ్రామిక్ రైళ్లు
ABN , First Publish Date - 2020-05-24T07:34:59+05:30 IST
వచ్చే పది రోజుల్లో 2,600 శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడుపుతామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఈ రైళ్లలో 36 లక్షల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తామని ఓ ప్రకటనలో ఆయన...

న్యూఢిల్లీ, మే 23 : వచ్చే పది రోజుల్లో 2,600 శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడుపుతామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఈ రైళ్లలో 36 లక్షల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తామని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. గత 23 రోజుల్లో 2,600 శ్రామిక్ రైళ్లలోఇప్పటికే 36 లక్షల మంది కార్మికులను తరలించామని చెప్పారు. దేశవ్యాప్తంగా వెయ్యి టికెట్ కౌంటర్లను పునఃప్రారంభించామని వెల్లడించారు. జూన్ 1 నుంచి పునఃప్రారంభించబోతున్న రైళ్లకు పాత ధరలనే చార్జి చేస్తామని పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం ఉద్దేశించిన 5,213 కోచుల్లో 50 శాతం కోచ్‌లను శ్రామిక్ ప్రత్యేక రైళ్ల కోసం ఉపయోగిస్తామని చెప్పారు.