పెళ్లిళ్ల కోసం వెళ్లి పాకిస్తాన్‌లో చిక్కుకున్న 26 మంది గుజరాతీలు..

ABN , First Publish Date - 2020-05-31T05:17:04+05:30 IST

గుజరాత్‌లోని గోద్రా నుంచి పాకిస్తాన్ వెళ్లిన కొందరు లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు...

పెళ్లిళ్ల కోసం వెళ్లి పాకిస్తాన్‌లో చిక్కుకున్న 26 మంది గుజరాతీలు..

గోద్రా: గుజరాత్‌లోని గోద్రా నుంచి పాకిస్తాన్ వెళ్లిన కొందరు లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వచ్చేనెల 4న తాము సరిహద్దు దాటేందుకు సాయం చేయాలంటూ వీరంతా భారత విదేశాంగ శాఖను అభ్యర్థించారు. ఫిబ్రవరి, మార్చి మధ్య వీరంతా కరాచీలో జరిగే వివాహ కార్యక్రమాల కోసం వెళ్లి బంధువుల వద్ద ఉన్నారు. అయితే భారత్‌లో కొవిడ్-19 లాక్‌డౌన్ విధించడంతో రైళ్లు, విమానాలతో పాటు అట్టారీ సరిహద్దు మార్గం కూడా మూసేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4న గోద్రా రైలు ఎక్కేందుకు వీలుగా అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద తమను అనుమతించేలా చూడాలంటూ వీరంతా భారత హైకమిషన్‌కు లేఖ రాశారు. 

Updated Date - 2020-05-31T05:17:04+05:30 IST