ఢిల్లీలో 550కి చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-08T04:10:13+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కొత్తగా 25 కరోనా కేసులు నమోదైనట్లు...

ఢిల్లీలో 550కి చేరిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కొత్తగా 25 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తంగా 550 మంది కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపింది. అయితే ఈ కేసుల్లో 331 కేసులు తబ్లీగీ జమాత్‌కు సంబంధం ఉన్నవేనని, అంటే 60 శాతం పైగా కేసులు ఆ కార్యక్రమం వల్ల వ్యాప్తి చెందినవేనని వివరించింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఎవరూ మరణించలేదని, మొత్తంగా 20 మంది కరోనానుంచి కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది.

Read more