మరికొంత మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-09-14T22:53:43+05:30 IST

మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేష్ సాహిబ్ సింగ్, సుఖ్‌బీర్ సింగ్, హనుమాన్ బెనివాల్, ఎస్.మజుందార్, గొడ్డేటి మాధవి, ప్రతాప్ రావు జాదవ్, జనార్దన్ సింగ్, బిద్యుత్ బరణ్, ప్రదాన్ బారువా..

మరికొంత మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కోవిడ్ పరీక్షలు అనివార్యం చేశారు. ఈ సందర్భంగా ఎంపీలకు కరోనా టెస్ట్ నిర్వహించగా పార్లమెంట్‌కు హాజరైన మొత్తం ఎంపీల్లో 25 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. మొదట ఈ సంఖ్య 17 అని అని తేలినప్పటికీ మరో 8 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డట్టు టెస్టుల్లో తేలింది.


మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేష్ సాహిబ్ సింగ్, సుఖ్‌బీర్ సింగ్, హనుమాన్ బెనివాల్, ఎస్.మజుందార్, గొడ్డేటి మాధవి, ప్రతాప్ రావు జాదవ్, జనార్దన్ సింగ్, బిద్యుత్ బరణ్, ప్రదాన్ బారువా, ఎన్.రెడ్డప్ప, సెల్వం జి, ప్రతాపరావు పాటిల్, రామ్ శంకర్ కథేరియా, సత్యపాల్ సింగ్, రాడ్మల్ నగర్ ఎంపీలు కోవిడ్ బారిన పడ్డట్టు ఇది వరకే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా మరో 8 మంది ఎంపీలకు కరోనా వైరస్ ఉన్నట్లు తెలిసింది. వారి వివరాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.


కాగా, రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన జేఎంఎం నేత శిబు సోరెన్, డీఎంకే ఎంపీ టి.శివ తదితరులు సోమవారంనాడు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ కారణంగానే ఎంపీలు సంతకం చేసిన పెన్నులను ఎప్పటికప్పుడు మార్చారు. విజిటర్స్ గ్యాలరీలోనూ భౌతికదూరం పాటించడం కనిపించింది.

Updated Date - 2020-09-14T22:53:43+05:30 IST