కాబూల్ గురుద్వారాపై ఆత్మాహుతి దాడి.. 25 మంది దుర్మరణం...

ABN , First Publish Date - 2020-03-25T21:51:49+05:30 IST

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి రక్తసిక్తమైంది. నగరంలోని ఓ గురుద్వారాపై...

కాబూల్ గురుద్వారాపై ఆత్మాహుతి దాడి.. 25 మంది దుర్మరణం...

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి రక్తసిక్తమైంది. నగరంలోని ఓ గురుద్వారాపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా..  మరో ఉగ్రవాది తప్పించుకుని పారిపోయినట్టు సమాచారం.  మూడో ఉగ్రవాదిని అంతకు ముందే హతమార్చినట్టు ఆఫ్ఘాన్ న్యూస్ ఛానెల్ టోలో న్యూస్ వెల్లడించింది. కాగా ఇంకా కొందరు గురుద్వారా లోపలే ఉన్నారనీ... వారి ఫోన్లు సిచ్ఛాఫ్ వస్తుండడంతో ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారేమోనన్న అనుమానంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబూల్‌లోని షోర్ బజార్ ప్రాంతంలో ఓ ‘ధరమ్‌శాల’పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఇక్కడ హిందువులు, సిక్కు మైనారిటీలు ఎక్కువగా నివసిస్తుంటారు. మరోవైపు ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ తాలిబన్ సంస్థ ఆఫ్ఘాన్ మీడియాకు సమాచారం పంపింది. 

Read more