పాకిస్తాన్ నుంచి భారత్ చేరుకున్న 248 మంది భారతీయులు

ABN , First Publish Date - 2020-06-26T02:28:39+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా పాకిస్తాన్‌లో చిక్కుకున్న 248 మంది భారతీయులు ఎట్టకేలకు ఇవాళ స్వదేశానికి..

పాకిస్తాన్ నుంచి భారత్ చేరుకున్న 248 మంది భారతీయులు

లాహోర్: లాక్‌డౌన్ కారణంగా పాకిస్తాన్‌లో చిక్కుకున్న 248 మంది భారతీయులు ఎట్టకేలకు ఇవాళ స్వదేశానికి తిరిగి వచ్చారు. వాఘా సరిహద్దు గుండా వీరంతా ఇవాళ భారత్‌లోకి ప్రవేశించారు. రెండు రోజుల్లో మరో 500 మంది దేశానికి తిరిగి రానున్నట్టు విదేశాంగ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. గురువారం తిరిగి వచ్చిన వారంతా దాదాపు గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. వాస్తవానికి ఇవాళ ఉదయమే వీరంతా వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నప్పటికీ.. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని గంటలు పాటు నిరీక్షించాల్సి వచ్చింది. కాగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తోంది. పాకిస్తాన్‌లో చిక్కుకున్న వారు తిరిగి వచ్చేందుకు ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజులు మాత్రమే వాఘా సరిహద్దు తెరుస్తామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-06-26T02:28:39+05:30 IST