మహారాష్ట్రపై మహమ్మారి పంజా.. బుధవారం ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-04-16T02:25:17+05:30 IST

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో...

మహారాష్ట్రపై మహమ్మారి పంజా.. బుధవారం ఒక్కరోజే..

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 232 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,916కు చేరింది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులను గమనిస్తే ఒక్క మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసులు 3వేలు దాటే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే ఈ రాష్ట్రంలో 9 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 187 కరోనా మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. 295 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.


మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో కూడా కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే ముంబైలో 183 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1936కు చేరింది. ఒక్క ముంబై నగరంలోనే ఇప్పటివరకూ 113 మంది కరోనా బారిన పడి మరణించారు.

Updated Date - 2020-04-16T02:25:17+05:30 IST