కరోనా ఎఫెక్ట్... వృద్ధి రేటు 23.9 % ప్రతికూలత
ABN , First Publish Date - 2020-09-02T00:10:08+05:30 IST
ప్రస్తుత(2020-21) ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు దారుణంగా పతనమైంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 23.9 శాతం మేర ప్రతికూలత నమోదైంది.. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాల్లో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. దీంతో వృద్ధి రేటు దశాబ్దాల కనిష్టానికి చేరుకుంటుందని ఇప్పటికే ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.

న్యూఢిల్లీ : ప్రస్తుత(2020-21) ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు దారుణంగా పతనమైంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 23.9 శాతం మేర ప్రతికూలత నమోదైంది.. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాల్లో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. దీంతో వృద్ధి రేటు దశాబ్దాల కనిష్టానికి చేరుకుంటుందని ఇప్పటికే ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.
ఈ అంచనాలకణుగుగుణంగానే... వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 23.9 శాతం మేర వృద్ధిరేటు క్షీణించింది. కాగా... 1996 లో క్వార్టర్ జీడీపీ లెక్కలు ప్రారంభించినప్పటి నుండి మొదటిసారి దారుణ క్షీణత నమోదు చేస్తుందని ఆర్థికవేత్తలు ముందు నుంచే చెబుతూ వస్తున్నారు.
జీడీపీ 19.2 శాతం క్షీణత నమోదు చేస్తుందని బ్లూమ్‌బర్గ్ సర్వేలో ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అయితే... దీనిని మించి ప్రతికూలత నమోదైంది.