ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న 22 శాతం మంది కరోనా బాధితులు

ABN , First Publish Date - 2020-03-28T22:05:30+05:30 IST

చైనాలోని ఒక చిన్న ప్రాంతంలో పుట్టి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది కరోనా వైరస్. దీని బారిన పడి ఇప్పటికే ఎందరో ...

ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న 22 శాతం మంది కరోనా బాధితులు

ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని ఒక చిన్న ప్రాంతంలో పుట్టి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది కరోనా వైరస్. దీని బారిన పడి ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది ఈ వైరస్ బారిన పడి అల్లాడుతున్నారు. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కొంత ఊరట కలిగించే విషయం ఏంటంటే వైరస్ సోకిన వారిలో దాదాపు 22 శాతం మంది అంటే దాదాపు 1.31 లక్షల మందికి పైగా కోలుకున్నారు. మిగిలిన వారిలో కూడా అనేకమంది కోలుకుంటారని డాక్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


ఇదిలా ఉంటే ప్రస్తుంతం ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. కరోనా పుట్టిల్లు చైనాను సైతం వెనక్కు నెట్టిన అమెరికాలో దాదాపు 1,04,800 పైగా కరోనా కేసులతో మొదటి స్థానం దక్కించుకుంది. ఇక ఇటలీ 86,500 కేసులతో రెండో స్థానంలో నిలవగా.. చైనా దాదాపు 82,000 కేసులతో మూడో స్థానంలో నిలిచింది. 65,700 పైగా కేసులతో స్పెయిన్ నాలుగో స్థానంలో.. 53,300కు పైగా కేసులతో జర్మనీ ఐదో స్థానంలో ఉన్నాయి. 33,400కు పైగా కేసులతో ఫ్రాన్స్ ఆరో స్థానంలో ఉండగా.. ఏడో స్థానంలో ఇరాన్ 32,300కు పైగా కేసులతో ఉంది. ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఇంగ్లండ్, స్విడ్జర్లాండ్‌లు వరుసగా 14,700, 13,000కు పైగా కేసులతో నిలిచాయి.


వీరిలో కూడా ఎక్కువమంది కోలుకునే అవకాశం ఉందని ఆయా దేశాల్లోని వైద్యాధికారులు, డాక్టర్లు వెల్లడిస్తున్నారు. మరణాల సంఖ్యను సాధ్యమయినంత వరకు నియంత్రించడమే లక్షంగా పనిచేస్తున్నామని వారు తెలిపారు.

Updated Date - 2020-03-28T22:05:30+05:30 IST