హర్యానాలో యువతి దారుణ హత్య.. ‘లవ్ జిహాద్’ అంటున్న నెటిజెన్లు

ABN , First Publish Date - 2020-10-27T20:38:16+05:30 IST

నిందితుడు తౌఫిక్ అని పోలీసులు గుర్తించారు. నిందుతుడిపై 2018లో కిడ్నాప్ కేసు వేసింది బాధితురాలి కుటుంబం. అయితే అది చర్చలతో ముగియడంతో అంతటితో వదిలేశారు. అనంతరం రెండేళ్ల తర్వాత యువతి ప్రాణాలపైకే వచ్చింది.

హర్యానాలో యువతి దారుణ హత్య.. ‘లవ్ జిహాద్’ అంటున్న నెటిజెన్లు

న్యూఢిల్లీ: యువతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి, అది కాస్త విఫలం కావడంతో హత్యకు పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. యువతి కాలేజీ నుంచి బయటికి వస్తున్న సమయంలో జరిగిందీ దారుణం. ఇదంతా సీసీటివీ పుటేజీల్లో రికార్డు కావడంతో నిందితులను గుర్తించి పట్టుకున్నారు పోలీసులు.


‘‘హర్యానాలోని ఫరీదాబాద్‌ సమీపంలోని బల్లబ్‌గర్‌లో కాలేజీ నుంచి బయటకి వస్తున్న 21 ఏళ్ల వయసున్న నికిత తోమర్ అనే యువతిని.. ఓ వ్యక్తి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిండాడు. అతనితో పాటు వచ్చిన ఇంకో వ్యక్తి ఇందుకు సహకరించాడు. అయితే యువతికి నిందితుడిని ప్రతిఘటించడంతో ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి ఇద్దరు పారిపోయారు’’ అని పోలీసులు తెలిపారు.


నిందితుడు తౌఫిక్ అని పోలీసులు గుర్తించారు. నిందుతుడిపై 2018లో కిడ్నాప్ కేసు వేసింది బాధితురాలి కుటుంబం. అయితే అది చర్చలతో ముగియడంతో అంతటితో వదిలేశారు. అనంతరం రెండేళ్ల తర్వాత యువతి ప్రాణాలపైకే వచ్చింది. కాగా, ఈ విషయమై నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ‘లవ్ జిహాదీ’ అంటూ వైరల్ చేస్తున్నారు.

Updated Date - 2020-10-27T20:38:16+05:30 IST