కరోనా సాయంపై కేంద్రానికి ట్రాన్స్‌జెండర్స్ లేఖ

ABN , First Publish Date - 2020-04-29T00:39:50+05:30 IST

యాచక వృత్తి, పడుపు వృత్తే తమ జీవనాధారాలుగా మారాయని అన్నారు. అయితే నేటి పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన నిబందనల కారణంగా ఆ పనులు చేసే అవకాశం కూడా లేదని, దీంతో తాము ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా సాయంపై కేంద్రానికి ట్రాన్స్‌జెండర్స్ లేఖ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ వల్ల కారణంగా తాము చాలా దెబ్బ తిన్నామని, తమకు వెంటనే లాక్‌డౌన్ సాయం కింద ప్రత్యేక ప్యాకేజీ అందించాలని 2,100 మంది ట్రాన్స్‌జెండర్లు కేంద్రానికి లేఖ రాశారు. దేశ చరిత్రలో ట్రాన్స్‌జెండర్ల కమ్యూనిటీకి ఎదురైన అతి పెద్ద విపత్తు ఇదేనని కేంద్రానికి రాసిన లేఖలో వారు పేర్కొన్నారు. చాలా మంది పేదరకింలో సామాజిక మినహాయింపులో జీవిస్తున్నారని.. యాచక వృత్తి, పడుపు వృత్తే తమ జీవనాధారాలుగా మారాయని అన్నారు. అయితే నేటి పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన నిబందనల కారణంగా ఆ పనులు చేసే అవకాశం కూడా లేదని, దీంతో తాము ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.


దేశంలో నెలకొన్న పరిస్థితులను తాము అర్థం చేసుకున్నామని, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని ట్రాన్స్‌జెండర్లు పేర్కొన్నారు. అయితే ఈ లాక్‌డౌన్ దేశ వ్యాప్తంగా తమ కమ్యూనిటీని తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. ఆహార కొరత, ఆరోగ్య సమస్యలతో లక్షలాది మంది ట్రాన్స్‌జెండర్లు అవస్థలు పడుతున్నారని, ఈ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సాయం అందించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. కేంద్రానికి రాసిన లేఖలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి తవార్ చంద్ గెహ్లాట్, హోంమంత్రి అమిత్ షాలను ప్రస్తావించారు.

Updated Date - 2020-04-29T00:39:50+05:30 IST