కరోనా రిపోర్ట్: హర్యానాలో 200కు పైగా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-05-31T00:57:16+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 200కు పైగా కరోనా పాజటివ్ కేసులు నమోదైనట్లు...

కరోనా రిపోర్ట్: హర్యానాలో 200కు పైగా పాజిటివ్ కేసులు

చండీఘర్: రాష్ట్రంలో కొత్తగా 200కు పైగా కరోనా పాజటివ్ కేసులు నమోదైనట్లు హర్యానా ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంట్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా 202 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,923కు చేరింది. వీరిలో 971  మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 932 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20 మరణాలు సంభవించాయి.

Updated Date - 2020-05-31T00:57:16+05:30 IST