ఏడాది ఆదాయం 1.7 లక్షలే! కానీ స్విస్ బ్యాంక్‌లో రూ. 200 కోట్లు..!

ABN , First Publish Date - 2020-07-20T17:58:24+05:30 IST

ఆ వృద్ధురాలు(81) తన సంవత్సరాదాయం లక్షే అని చెప్పారు. కానీ స్వీస్ బ్యాంకులో మాత్రం 200 కోట్లు ఉన్నాయి.

ఏడాది ఆదాయం 1.7 లక్షలే! కానీ స్విస్ బ్యాంక్‌లో రూ. 200 కోట్లు..!

న్యూఢిల్లీ: ఆ వృద్ధురాలు(81) తన సంవత్సరాదాయం 1.7 లక్షలే అని చెప్పారు. కానీ స్విస్ బ్యాంకులో మాత్రం 200 కోట్లు ఉన్నాయి. దీంతో ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ బ్యాంకు డిపాటిజిట్‌పై కూడా పన్ను కట్టాల్సిందేనంటూ ఝలకిచ్చింది. 2006 నాటి పన్ను చెల్లింపు వివాదంపై ట్రిబ్యూనల్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే మహిళ మాత్రం ఈ అకౌంట్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని తొలుత వాదించే ప్రయత్నం చేశారు. ఆ స్విస్ అకౌంట్..ఓ ఫ్యామిలీ ట్రస్ట్ పేరిట ఉందని చెప్పుకొచ్చారు. ఈ ట్రస్ట్‌ సొమ్ముకు తాను వారసురాలు కాదని స్పష్టం చేశారు. అయితే.. అకౌంట్‌ క్లోజ్ అయ్యే సమయంలో 4 కోట్ల రూపాలయను సెటిల్‌మెంట్ కింద ఎందుకు తీసుకున్నారని ట్రిబ్యూనల్ ఆమెను ప్రశ్నించింది.  అకౌంట్ సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకు నుంచి సేకరించేందుకు ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు ఎందుకు అనుమతివ్వలేదని కూడా ప్రశ్నించింది. ఈ కారణాలు చూపుతూ ఆమె వాదనలను కొట్టిపారేసిన ట్రిబ్యూనల్..స్విస్ అకౌంట్‌లోని రూ. 200 కోట్లపై పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.


Updated Date - 2020-07-20T17:58:24+05:30 IST