నైట్పార్టీలో కాల్పులు.. 20మంది మృతి
ABN , First Publish Date - 2020-08-11T08:18:06+05:30 IST
అమెరికాలోని వాషింగ్టన్లో ఒక విందులో చెలరేగిన గొడవ.. కాల్పులకు దారి తీసింది. ఈ సంఘటనలో 20మంది మరణించగా, ఒక పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి 12.30గంటల సమయంలో గొడవ చెలరేగిందని...

వాషింగ్టన్, ఆగస్టు 10: అమెరికాలోని వాషింగ్టన్లో ఒక విందులో చెలరేగిన గొడవ.. కాల్పులకు దారి తీసింది. ఈ సంఘటనలో 20మంది మరణించగా, ఒక పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి 12.30గంటల సమయంలో గొడవ చెలరేగిందని పోలీసులు తెలిపారు. కనీసం ముగ్గురు వ్యక్తులు కాల్పులకు దిగినట్లు అనుమానిస్తున్నామని, మృతి చెందిన వారిలో 11మంది మహిళలు ఉన్నారని చెప్పారు. అయితే, పార్టీకి కనీసం 400 మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. లాక్డౌన్ ఆంక్షల వల్ల 50మందికి మించి గుమికూడరాదనే అదేశాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అందువల్ల నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని పేర్కొంది.