అనంత్‌నాగ్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2020-09-25T16:27:16+05:30 IST

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా సిర్హామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

అనంత్‌నాగ్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

అనంత్‌నాగ్: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా సిర్హామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఇద్దరినీ లష్కరే తోయిబాకు చెందిన వారిగా భద్రతా దళాలు గుర్తించాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య నిన్న రాత్రి నుంచి కాల్పులు సాగుతున్నాయి. సిర్హామాలో గురువారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా.. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భ‌ద్ర‌తా ద‌ళాలు ఎదురు కాల్పులకు దిగాయి. సెర్చ్ ఆపరేషన్ ఇంకా జరుగుతుందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Updated Date - 2020-09-25T16:27:16+05:30 IST