కాబూల్‌లో కారు బాంబు పేలుడు.. ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2020-11-13T23:27:43+05:30 IST
కాబూల్‌లో కారు బాంబు పేలుడు.. ఇద్దరు మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి కారు బాంబు పేలుడులో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కాబూల్ వెస్ట్రన్ ఎంట్రీ గేట్ వద్ద ప్రభుత్వ దళాలను లక్ష్యంగా చేసుకొని ఈ పేలుడుకు పాల్పడినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తెలిపారు. ఉత్తర కుండుజ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ భద్రతా దళాల చెక్‌పాయింట్‌పై తాలిబాన్లు దాడి చేసి ఐదుగురు సైనికులను చంపిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది.