మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా!

ABN , First Publish Date - 2020-07-19T22:52:08+05:30 IST

పంజాబ్‌కు చెందిన మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాప్టెన్ అమరీందర్ సింగ్ ఆదివారం ట్వీట్ చేశారు.

మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా!

చండీగఢ్: పంజాబ్‌కు చెందిన మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాప్టెన్ అమరీందర్ సింగ్ ఆదివారం ట్వీట్ చేశారు. ‘నా సహచర ఎమ్మెల్యేలు బల్వీందర్ ధలీవాల్, ధరంబీర్ అగ్నిహోత్రీకి కరోనా సోకినట్టు పరీక్షలో తేలింది. వారిద్దరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని సీఎం ట్వీట్ చేశారు.


రాష్ట్ర మంత్రి త్రిపత్ సింగ్ బజ్వా కరోనా బారిన పడ్డారని తెలిసిన కొద్ది రోజులకే ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ అని తేలడంతో పంజాబ్ మరోసారి ఉలిక్కిపడింది. ప్రస్తుతం కరోనా బారిన పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరుకుంది. మరోవైపు..మంత్రి బజ్వా భార్య, కుమారుడికి కూడా కరోనా సోకినట్టు ఇటీవల వెల్లడైంది. అయితే వారిద్దరిలో కరోనా రోగ లక్షణాలు లేకపోవడంతో వారిరువురూ హోం క్వారంటైన్‌కే పరిమితమయ్యారు. 

Updated Date - 2020-07-19T22:52:08+05:30 IST