ఉత్తరప్రదేశ్‌లో 191 మంది ఖైదీలకు కరోనా..!

ABN , First Publish Date - 2020-08-12T03:33:33+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో బస్తీ జిల్లాలోని జైల్లో ఏకంగా 191 మంది ఖైదీలు కరోనా బారిన పడినట్టు వెల్లడైంది.

ఉత్తరప్రదేశ్‌లో 191 మంది ఖైదీలకు కరోనా..!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోగల జైల్లో ఏకంగా 191 మంది ఖైదీలు కరోనా బారిన పడినట్టు వెల్లడైంది. మొత్తం 374 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. ఖైదీలకు యాంటీజెన్ కరోనా పరీక్షలు జరిపినట్టు సమాచారం. అయితే వీరెవరికీ వ్యాధి లక్షణాలు లేవని ఏడీఎమ్ రమేశ్ చంద్ర తెలిపారు. కరోనా సోకిన వారిలో ఎనిమిది మంది మినహా మిగితా వారిని ఐసోలేషన్ వార్డులో పెట్టామని చెప్పారు. ఆ ఎనిమిది మంది ఖైదీలకు ఇతర రుగ్మతలు ఉండటంతో వారిని ఆస్పత్రికి తరించామన్నారు. జైల్లో కరోనా రోగం ప్రబలడంతో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఖైదీలు కరోనా బారిన ఎలా పడ్డారో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించింది. 

Updated Date - 2020-08-12T03:33:33+05:30 IST