పుణేలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులో 1,806 మందికి..
ABN , First Publish Date - 2020-08-11T06:07:55+05:30 IST
మహారాష్ట్రలోని పుణే జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ..

పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 1,806 మంది కరోనా బారినపడినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,09,326కి పెరిగింది. కాగా గడచిన 24 గంటల్లో ఇక్కడ 52 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పుణే జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 2,504కి చేరింది. ఈ వైరస్ బారి నుంచి ఇవాళ 1,499 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కొత్తగా నమోదైన 1806 కేసుల్లో 761 కేసులు ఒక్క పుణే మున్సిపల్ కార్పొరేషన్ నుంచే వచ్చినట్టు ఆయన తెలిపారు. దీంతో నగరంలో మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 65,966 చేరుకుంది. కాగా పింప్రి-చించ్వాడ్‌లో మరో 679 కేసులు నమోదు కావడంతో ఇక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 29,836 చేరిందని సదరు అధికారి వెల్లడించారు.