కువైట్ నుంచి వచ్చిన 18 మందికి కరోనా... భయంలో విమానయాన సిబ్బంది
ABN , First Publish Date - 2020-05-18T16:59:22+05:30 IST
కువైట్ నుండి తిరిగి వచ్చిన 240 మంది భారతీయులలో 18 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విమానాశ్రయ సిబ్బంది...

ఇండోర్: కువైట్ నుండి తిరిగి వచ్చిన 240 మంది భారతీయులలో 18 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విమానాశ్రయ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. మే 13న రాత్రి 240 మంది భారతీయులు కువైట్ నుండి రెండు విమానాల ద్వారా ఇండోర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని భోపాల్‌కు బస్సులో తరలించి, అక్కడ క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. తరువాత వారి నమూనాలను కరోనా పరీక్షల కోసం పంపారు. ఇప్పటివరకు వచ్చిన రిపోర్టులలో 18 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. కువైట్ నుండి తిరిగి వచ్చిన కొంతమందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో విమానాశ్రయ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ విభాగం సిబ్బందిలో భయాందోళన నెలకొంది.