చీరకట్టి డ్యాన్స్ చేయించిన ఫ్రెండ్స్.. వీడియో డిలీట్ చేయమన్నాడని..

ABN , First Publish Date - 2020-07-11T04:16:30+05:30 IST

ఓ 17ఏళ్ల కుర్రాడికి అతని మిత్రులంతా కలిసి చీరకట్టి డ్యాన్స్ చేయించారు. ఈ నృత్యాన్ని వీడియో తీశాడు వారిలో మరో యువకుడు.

చీరకట్టి డ్యాన్స్ చేయించిన ఫ్రెండ్స్.. వీడియో డిలీట్ చేయమన్నాడని..

ముంబై: ఓ 17ఏళ్ల కుర్రాడికి అతని మిత్రులంతా కలిసి చీరకట్టి డ్యాన్స్ చేయించారు. ఈ నృత్యాన్ని వీడియో తీశాడు వారిలో మరో యువకుడు. ఆ వీడియో డిలీట్ చేయాలని డ్యాన్స్  చేసిన కుర్రాడు అడిగితే కుదరదన్నారు. దీంతో ఇంట్లో పెద్దవాళ్లకు చెబుతానని అతను స్నేహితులను బెదిరించాడు. అంతే ఆ బృందం మధ్య పెద్ద గొడవ చెలరేగింది. ఈ ఘర్షణలో చీర కట్టుకొని నృత్యం చేసిన యువకుడు మరణించాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ముగ్గురు మైనర్లు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-07-11T04:16:30+05:30 IST