విమానంలో వెళ్లిన 174 మంది కార్మికులు

ABN , First Publish Date - 2020-05-29T07:15:28+05:30 IST

కలలోనైనా ఊహించని జ్ఞాపకం జీవితానుభవంలో పదిలమైతే? ఆ వలస కార్మికులది ఇప్పుడు అలాంటి తృప్తే! విమానంలో ప్రయాణిస్తామని ఊహామాత్రంగానైనా అనుకోని వారికి ఆ అవకాశం...

విమానంలో వెళ్లిన 174 మంది కార్మికులు

రాంచీ/ముంబై, మే 28: కలలోనైనా ఊహించని జ్ఞాపకం జీవితానుభవంలో పదిలమైతే? ఆ వలస కార్మికులది ఇప్పుడు అలాంటి తృప్తే! విమానంలో ప్రయాణిస్తామని ఊహామాత్రంగానైనా అనుకోని వారికి ఆ అవకాశం వచ్చింది. ముంబై నుంచి 174 మంది వలస కార్మికులు చార్టర్డ్‌ విమానంలో తమ స్వరాష్ట్రమైన జార్ఖండ్‌లోని రాంచీకి వెళ్లారు. గురువారం ఉదయం 6:25 గంటలకు కార్మికులతో బయలుదేరిన విమానం ఉదయం 8.25 గంటలకు రాంచీ ఎయిర్‌పోర్టులో దిగింది. బెంగళూరుకు చెందిన నేషనల్‌ లా స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఈ మేరకు కార్మికులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   


Updated Date - 2020-05-29T07:15:28+05:30 IST