కోవిడ్ హాట్‌స్పాట్‌లుగా 170 జిల్లాలు..

ABN , First Publish Date - 2020-04-16T01:31:32+05:30 IST

దేశంలోని 170 జిల్లాలను కోవిడ్-19 హాట్‌స్పాట్‌లుగా కేంద్ర గుర్తించింది. వీటిని 'రెడ్ జోన్‌'లుగా వర్గీకరించింది. వైరస్ మరింత..

కోవిడ్ హాట్‌స్పాట్‌లుగా 170 జిల్లాలు..

న్యూఢిల్లీ: దేశంలోని 170 జిల్లాలను కోవిడ్-19 హాట్‌స్పాట్‌లుగా కేంద్రం గుర్తించింది. వీటిని 'రెడ్ జోన్‌'లుగా వర్గీకరించింది. వైరస్ మరింత విస్తరించకుండా ఈ జిల్లాల్లో అతి కఠినమైన లాక్‌డౌన్ చర్యలు తీసుకుంటారు. అత్యధిక హాట్‌స్పాట్‌లు గుర్తించిన రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 37 జిల్లాల్లో 22 జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. అక్కడ 14 జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించగా, ఉత్తరప్రదేశ్‌లో 13, రాజస్థాన్‌లో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11, ఢిల్లీలో 10 హాట్‌స్పాట్‌లను గుర్తించారు.


తెలంగాణలో...

తెలంగాణలో 8 హాట్‌స్పాట్‌లు గుర్తించగా, పంజాబ్, జమ్మూకశ్మీర్, కర్ణాటకలోనూ ఎనిమిదేసి చొప్పున హాట్‌స్పాట్‌లు గుర్తించారు. కేరళలో 7, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానాలో 6 చొప్పున హాట్‌స్పాట్‌లు గుర్తించారు. అసోం, హిమాచల్ ప్రదేశ్‌లలో చెరో 5 జిల్లాలు ఉన్నాయి. బీహార్, పశ్చిమబెంగాల్‌లో నాలుగేసి జిల్లాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి.

Updated Date - 2020-04-16T01:31:32+05:30 IST