17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి రావడానికి సిద్ధమైపోయారు : ఆర్జేడీ

ABN , First Publish Date - 2020-12-30T16:30:46+05:30 IST

జేడీయూకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ సంచలన ప్రకటన చేశారు. ఆర్జేడీలో

17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి రావడానికి సిద్ధమైపోయారు : ఆర్జేడీ

పాట్నా : జేడీయూకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ సంచలన ప్రకటన చేశారు. ఆర్జేడీలో చేరడానికి వారు సిద్ధమైపోయారని బాంబు పేల్చారు. ‘‘జేడీయూకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీతో టచ్‌లో ఉన్నారు. గతంలోనే మా పార్టీలోకి చేరాలని డిసైడ్ అయ్యారు. కానీ మేమే సమయం కాదని ఆపాం. ఫిరాయింపు వ్యతిరేక చట్ట కారణంగా వారు తమ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.’’ అని శ్యామ్ పేర్కొన్నారు. సీఎం నితీశ్‌తో మిత్రపక్షమైన బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై చాలా మంది జేడీయూ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే 25 నుంచి 26 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి వస్తే మాత్రం ఫిరాయింపుల చట్టం అవసరం ఉండదని, అది త్వరలోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను జేడీయూ కొట్టిపారేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ మండిపడ్డారు. జేడీయూ ఎమ్మెల్యేలందరూ ఐకమత్యంగానే ఉన్నారని, ఆర్జేడీయే వారి ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకోవాలని రాజీవ్ రంజన్ చురకలంటించారు.  

Updated Date - 2020-12-30T16:30:46+05:30 IST