భారత్‌లో పెరిగిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో..

ABN , First Publish Date - 2020-04-24T14:59:11+05:30 IST

భారత్‌లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నప్పటికీ...

భారత్‌లో పెరిగిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో..

భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 1684  కరోనా కేసులు, 37 మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు, 37 కరోనా మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తాజాగా వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ 23,000 మార్క్‌ను దాటింది.


భారత్‌లో ఇప్పటివరకూ 23,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 718 మంది కరోనా వల్ల మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 17610 కాగా.. 4749 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Updated Date - 2020-04-24T14:59:11+05:30 IST