24 గంటల్లో 163 కరోనా కేసులు.. దేశంలో కలకలం

ABN , First Publish Date - 2020-03-28T16:26:50+05:30 IST

శంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకొంటున్న...

24 గంటల్లో 163 కరోనా కేసులు.. దేశంలో కలకలం

  • 887కు చేరిన బాధితుల సంఖ్య
  • 20 మంది మృతి


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలేవీ అంత ఫలితాన్నివ్వడంలేదు. దేశం మొత్తాన్ని లాక్‌డౌన్ చేసినా నమోదౌతున్న పాజిటివ్ కేసుల్లో తగ్గుదల ఏ మాత్రం కనపడడం లేదు. 


గత 24 గంటల్లోనే దేశం మొత్తం మీద 163 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత స్థాయిలో ఒక్కరోజే కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కోవిడ్-19 తో బాధపడుతున్న వారి సంఖ్య ఇప్పటివరకు 887కు చేరింది. అలాగే  కోవిడ్-19 బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య కూడా 20కు చేరింది.

Updated Date - 2020-03-28T16:26:50+05:30 IST