భారీ వర్షాలతో కుప్పకూలిన 151 ఏళ్ల పురాతన చర్చి
ABN , First Publish Date - 2020-08-12T01:48:21+05:30 IST
భారీ వర్షాల కారణంగా ఓ చెరువు తెగిపోవడంతో కేరళలో 151 ఏళ్ల నాటి ఓ పురాతన చర్చి కూలిపోయింది...

తిరువనంతపురం: భారీ వర్షాల కారణంగా కేరళలోని 151 ఏళ్ల నాటి ఓ పురాతన చర్చి కూలిపోయింది. ఇవాళ ఉదయం అలప్పూజ జిల్లా చుంగాం కురువెల్లి పదశేఖరం ప్రాంతంలోని సెయింట్ పాల్ సీఎస్ఐ చర్చి కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. సమీపంలోని ఓ చెరువుగట్టు తెగిపోవడంతో రెండు వరిపొలాల మధ్య ఉన్న ఈ చర్చిలోకి వరదనీరు ప్రవేశించిందనీ.. దీని కారణంగానే చర్చి కూలిపోయిందని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పెద్దఎత్తున వరద పోటెత్తడంతో అధికారుల ముందస్తు హెచ్చరికలతో స్థానికులు అప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లాలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.