వాళ్లకు సీఎం గుడ్‌న్యూస్.. సొంత రాష్ట్రానికి చేర్చేందుకు బయల్దేరిన బస్సులు
ABN , First Publish Date - 2020-04-27T02:26:08+05:30 IST
రాజస్థాన్‌లోని కోటలో ఉన్న 150 మంది పంజాబ్ విద్యార్థుల కోసం పంజాబ్ నుంచి ఏడు బస్సులను పంపినట్లు...

చండీగఢ్: రాజస్థాన్‌లోని కోటలో ఉన్న 150 మంది పంజాబ్ విద్యార్థుల కోసం పంజాబ్ నుంచి ఏడు బస్సులను పంపినట్లు సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. వారంతా తిరుగు ప్రయాణంలో ఉన్నారని, సోమవారం ఉదయానికి పంజాబ్‌కు చేరుకుంటారని ఆయన తెలిపారు. అంతేకాదు, రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో 5 రిలీఫ్ క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్న 2,700 మంది పంజాబీలను సొంత రాష్ట్రానికి చేర్చేందుకు 60 పంజాబ్ ప్రభుత్వ బస్సులను పంపినట్లు ఆయన ట్వీట్ చేశారు.
నాందేడ్‌లో చిక్కుకున్న పంజాబ్‌కు చెందిన యాత్రికుల్లో 219 మంది ఇప్పటికే స్వస్థలాలకు చేరుకున్నారని సీఎం తెలిపారు. మిగిలిన 643 మంది పంజాబ్‌కు చేర్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అమరీందర్ ట్వీట్ చేశారు. 80 పంజాబ్ ప్రభుత్వ బస్సులు సోమవారం ఉదయానికి నాందేడ్‌కు చేరుకుంటాయని, వారిని బస్సుల్లో ఎక్కించుకున్న వెంటనే పంజాబ్‌కు తిరుగు పయనమవుతాయని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.