యూపీలో మరో దారుణం.. అత్యాచారానికి గురైన దళిత బాలిక ఆత్మహత్య...

ABN , First Publish Date - 2020-10-14T06:51:46+05:30 IST

హత్రాస్ ఘటనతో అట్టుడుకుతున్న ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిత్రకూట్ జిల్లాలోని మాణిక్‌పూర్ ప్రాంతంలో అత్యాచారానికి..

యూపీలో మరో దారుణం.. అత్యాచారానికి గురైన దళిత బాలిక ఆత్మహత్య...

చిత్రకూట్: హత్రాస్ ఘటనతో అట్టుడుకుతున్న ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిత్రకూట్ జిల్లాలోని మాణిక్‌పూర్ ప్రాంతంలో అత్యాచారానికి గురైన 15 ఏళ్ల ఓ బాలిక ఉరిపెట్టుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ నెల 8న సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆమెపై ముగ్గురు వ్యక్తులు ఆత్యాచారానికి పాల్పడ్డారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడైన కిషన్ ఉపాధ్యాయ్, అతడి మిత్రులు ఆశిష్, సతీశ్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా తమ కుమార్తెపై జరిగిన దారణంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అయితే బాధిరాలి కుటుంబం నుంచి తమకు రాతపూర్వతంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వాదిస్తున్నారు. మరోవైపు పోస్టుమార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలిందనీ... అయితే ఇప్పడు ఆమె శాంపిళ్లను ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్‌కి పంపిస్తున్నామని పోలీసులు పేర్కొనడం కొసమెరుపు. 

Updated Date - 2020-10-14T06:51:46+05:30 IST