24 గంటల వ్యవధిలో 1463 కొత్త కేసులు

ABN , First Publish Date - 2020-04-15T16:09:23+05:30 IST

దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది.

24 గంటల వ్యవధిలో 1463 కొత్త కేసులు

హైదరాబాద్:  దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. గత 24 గంటల వ్యవధిలో 1463 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారిన పదినవారి సంఖ్య 10,815కు చేరింది. 1189 మంది కోలుకోగా మరో 9,872 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 29 కరోనా మరణాలు సంభవించాయి. చనిపోయినవారిలో 11 మంది మహారాష్ట్రవాసులు, 7గురు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధిక కోవిడ్ మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో మొత్తం 2,337 మందికి కరోనా సోకగా.. 160 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 730 కేసులు నమోదు అయితే.. 50 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 353కు చేరింది. మహారాష్ట్రలో పరిస్థితి మరీ గడ్డుగా మారింది. దేశంలో మొత్తం రోగుల సంఖ్యలో దాదాపు 23 శాతం మహారాష్ట్రలో ఉన్నారు. మరణాల్లో దాదాపు 45 శాతం అక్కడే. మొత్తం 36 జిల్లాలకు 28 జిల్లాలో వైరస్ బారిన పడ్డాయి.

Updated Date - 2020-04-15T16:09:23+05:30 IST